దోమకొండలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

66చూసినవారు
దోమకొండలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
దోమకొండ మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దోమకొండ మండల కేంద్రంతో పాటు చింతామాన్ పల్లి, ముత్యంపేట, లింగుపల్లి, సంగమేశ్వర్, అంచనూర్, అంబర్పేట, సీతారాంపల్లి గ్రామాల్లో పలు ప్రభుత్వ కార్యాలయ వద్ద, పలు పార్టీల వద్ద జెండాలను ఎగురవేశారు. దోమకొండలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శారద నాగరాజ్ ఎగురవేయగా పలు ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు జెండాలు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు తిర్మల్ గౌడ్, విండో చైర్మన్లు నాగరాజు రెడ్డి, తిరుపతి గౌడ్, ఎంపీటీసీలు కడారి రమేష్, శంకర్, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, పలు పార్టీలకు చెందిన నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్