తమ్ముని శవం చూసి చలించిపోయి అన్న మృతి

61చూసినవారు
తమ్ముని శవం చూసి చలించిపోయి అన్న మృతి
తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో డి నర్సింలు 15 రోజుల క్రితం ల్ మస్కట్ దేశంలో మరణించాడు. అతని శవం ఆదివారం గ్రామానికి మస్కట్ నుండి వచ్చింది. శవ అంత్యక్రియలు ప్రారంభం కాగా, మృతుని పెద్ద అన్న పెద్ద నరసింహులు శవయాత్రలో కొద్ది దూరం నడిచాక , అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఒకేరోజు అన్న తమ్ముళ్ల అంత్యక్రియలు చూసిన ప్రజలు కంట తడి పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్