ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని శుక్రవారం రైతులు నిర్బంధించినారు. చైర్మన్ కపిల్ రెడ్డితో పాటు పాలకవర్గాన్ని భవనం లోపల వేసి తాళం వేశారు. రుణమాఫీ చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని రైతులు హెచ్చరించారు. సీఎం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.