సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య: హెచ్ఎం

70చూసినవారు
సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య: హెచ్ఎం
ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో మంగళవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలను కలిసి, ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని హెచ్ఎం బట్టురి రాజేశం కోరారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హెచ్ఎం రాజేశం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్