హూజురాబాద్ లో శనివారం విద్యుత్ సబ్ స్టేషన్ మరమత్తుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పట్టణ విద్యుత్ ఎ. ఈ శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని, హుజురాబాద్ పట్టణం, కొత్తపల్లి, తుమ్మనపల్లి, బోర్నపల్లి గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.