గుండెపోటుతో రంగస్థలం నటుడు మృతి

5661చూసినవారు
గుండెపోటుతో రంగస్థలం నటుడు మృతి
హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లె గ్రామానికి చెందిన రంగస్థల నటుడు పోరెడ్డి శ్రీనివాసరెడ్డి (68) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. పెద్ద పాపయ్యపల్లిలో మొట్టమొదటిసారిగా శివరామకృష్ణ భజన మండలి స్థాపించి ఎంతోమంది కళాకారులను తయారు చేశారు. అలాగే హైదరాబాద్ లో నటరాజ కళాకారుల సంక్షేమ సంఘం స్థాపించి దానికి అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఆయన మరణం పట్ల పలువురు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్