జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదనపు రెవెన్యూ కలెక్టర్ లత, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, కాంగ్రెస్ నాయకులు, వడ్డెర సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి, జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి యాదగిరి, తిరుపతి, మహేశ్, యాదగిరి, శంకర్, రాజ్ నర్సయ్య పాల్గొన్నారు.