జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్‌ను పోలీసులు సోమవారం హైదరాబాద్ లోని అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ సిఎం రేవంత్ ఆధానీ కలిసినట్టు ఉన్న ఫోటోలు తన షర్ట్ పై ముద్రించుకుని నిరసన తెలిపినందుకు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యేకు మద్దతుగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేవంత్ ఆధానీ భాయి భాయి అంటూ నినాదాలు చేశారు.