శంకరపట్నంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

63చూసినవారు
లోక కళ్యాణం కొరకే మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి పేర్కొన్నారు. ఆదివారం శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం బ్రహ్మ విద్యాశ్రమ ఆవరణలో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలలో భాగంగా రుద్రాభిషేకాలు నిర్వహించుటకు సంకల్పించినట్లు లింగమూర్తి వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్