కాంగ్రెస్ లోకి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్

76చూసినవారు
కాంగ్రెస్ లోకి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల సురేందర్ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు సమక్షంలో బిఆర్ఎస్ నాయకులు సురేందర్ తోపాటు పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కౌన్సిలర్స్, జెడ్పీటీసిలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్