రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

1572చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
పెద్దపల్లి పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ పండుగను పురస్కరించుకొని గురువారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. మతసామరస్యానికి తెలంగాణ నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, మైనారిటీ మత పెద్దలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్