చదువులతో పాటు ఆటల్లో కూడా రాణించాలి

61చూసినవారు
చదువులతో పాటు ఆటల్లో కూడా రాణించాలి
ఆటల్లోను చదువుల్లో యువకులూ రాణించాలని ఎస్సై జీల్లెల రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మాడల్ స్కూల్ లో దోస్త్ మీట్ 2024 క్రీడ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఆటల్లో కబడ్డీ విభాగంలో మద్దిమల్ల ప్రథమం, వీర్నపల్లి ద్వితీయ స్థానం, వాలి బాల్ విభాగం లో వీర్నపల్లి ప్రథమ స్థానం, అడవి పదిర ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఎస్సై జీల్లెల రమేష్ క్రీడా కారులకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్