రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సాయి నగర్ లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ నివాసం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో స్థానిక మహిళలతో కలసి బతుకమ్మ ఆడిన ప్రభుత్వ విప్ సతీమణి, మాజీ జడ్పీటీసీ ఆది వనజ పాల్గొని ఆడపడుచులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.