రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీ (వీడియో)

80చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామం నుంచి ఫాజుల్ నగర్ గ్రామం వరకు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ప్రమాదాల నివారణకు నియంత్రిత వేగంతో ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మారుతి, పోలీస్ సిబ్బందితో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్