వేములవాడ: మహాశివరాత్రి పర్వదినం గుడిలో మహాలింగార్చన పూజ

77చూసినవారు
వేములవాడ: మహాశివరాత్రి పర్వదినం గుడిలో మహాలింగార్చన పూజ
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలోని అద్దాల మండపంలో మహా లింగార్చన పూజ ప్రారంభమైంది. లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజా కార్యక్రమాలను మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో అర్చకులు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్