కుక్కల స్వైర విహారంతో వేములవాడలో రాజన్న భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాస్త్రి నగర్ లో, శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ వసతి గదుల సమీపంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో పలుమార్లు కుక్కలు దాడులు జరిగాయి. కుక్కల బెడద తగ్గించాలని పట్టణ ప్రజలు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు.