రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

76చూసినవారు
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రైతన్నలు, సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టి, ప్రజల జీవితాల్లో మరింతగా గుణాత్మక మార్పును తీసుకురావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు కేసీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. సాగునీరుతో సమృద్ధిగా పంటలు పండేలా దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్