రాష్ట్ర ప్రభుత్వం రైతులకు షరతులు విధించకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని సిపిఐ (ఎం) మండల నాయకులు పొన్నం మురళి అన్నారు. సోమవారం కాచిరాజుగూడెంలో రుణమాఫీ పై సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మూడు విడతల్లో రుణమాఫీ కానీ రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.