నగరంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని గుర్తించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు. బుధవారం ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శించిన ఆయన ధంసలాపురం వద్ద నూతనంగా నిర్మించనున్న ఎస్ టిపీకి స్థల పరిశీలన చేశారు. నగరంలోని పలు డివైడర్లు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పెంచాలని అధికారులకు సూచించారు.