ఖమ్మంకు చేరుకున్న కేసీఆర్ బస్సు యాత్ర

53చూసినవారు
ఖమ్మంకు చేరుకున్న కేసీఆర్ బస్సు యాత్ర
ఖమ్మం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేలాది సంఖ్యలో పాల్గొని జన సంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్