ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ షిరిడి సాయి దేవాలయ కమిటీ సభ్యులు గురువారం పలువురు దాతల సహాయ సహకారాలతో పట్టణంలోని అభాగ్యులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ. మానవ సేవే మాధవ సేవ భావించి ప్రతి వారం స్వామి వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.