ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల సాధనకు పీఆర్టీయూ నిరంతరం కృషి చేస్తున్నట్లు పీఆర్టీయు మండల అధ్యక్షులు చిలుకూరి సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం మధిర పీఆర్టీయు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడారు. పెండింగ్ డిఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు, పీఎస్ హెచ్ఎంల మంజూరు తదితర సమస్యల సాధనకు శ్రమిస్తున్నట్లు చెప్పారు. అటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని పేర్కొన్నారు.