వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ నియమ, నిబంధనలు పాటించాలని మధిర సీఐ మధు తెలిపారు. మధిర రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ పోలీస్ అనుమతి తీసుకొని గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. డీజే సౌండ్ సిస్టంకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల వరకే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్సై లక్ష్మి భార్గవి ఉన్నారు.