ఖమ్మం రూరల్ మండలం తీర్థాలకు చెందిన మాచర్ల మధు(30)అనే యువకుడు గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కాగా ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చూపించగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో డెంగ్యూ నిర్ధారణ అయింది. అటు అతని లివర్లకు కూడా ఇన్ఫెక్షన్ కావడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ తరలించారు. శుక్రవారం అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మరణించాడు.