ఖమ్మం జిల్లాలో మూడో విడత రైతు రుణమాఫీ లిస్టును జిల్లా అధికారులు శుక్రవారం విడుదల చేశారు. మూడో విడతలో మొత్తం 23, 828 మంది రైతులకు రూ. లక్షన్నర నుంచి 2 లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. అటు మొదటి, రెండు విడతల్లో వివిధ కారణాలతో రుణమాఫీ కానీ రైతులు స్థానిక కలెక్టరేట్ నందు ఏర్పాటుచేసిన, రైతు రుణమాఫీ ప్రత్యేక కౌంటర్ నందు సంప్రదించాలని జిల్లా అధికారులు పేర్కొన్నారు.