కూసుమంచి: ఆటోలో ప్రమాదకరంగా కూలీల ప్రయాణం

76చూసినవారు
కూసుమంచి: ఆటోలో ప్రమాదకరంగా కూలీల ప్రయాణం
జీవనం కోసం మహిళా కూలీలు చేసే ప్రయాణం ప్రమాదకరంగా ఉంటోంది. ఆదివారం కూసుమంచి మండల కేంద్రం మీదుగా మహిళా కూలీలు పరిమితికి మించి ప్రయాణాలు చేస్తున్నారు. ఆటోల యజమానులు కాసులకు కక్కుర్తిపడి ఏడుగురు ప్రయాణించాల్సిన వాహనంలో 20 మంది దాకా ఎక్కిస్తున్నారు. ఇలా ప్రయాణించి ప్రమాదానికి గురై కూలీలు మరణించిన సంఘటనలు చాలా ఉన్నాయి.  అధికారులు అసలు పట్టించుకోవడం లేదని, వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్