రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులకు డైట్ చార్జీలను పెంచిందని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. మంగళవారం వేంసూరు మండలం అసర్లపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు తెలుసుకొని, వారితో కలిసి ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థిని, విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.