మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసి రైతులను తరిమేయాలని కుట్ర పన్నిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు విమర్శించారు. కొణిజర్ల మండలం తనికెళ్లలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర వ్యవసాయ పంటల మద్దతు ధర చట్టం తీసుకొచ్చి రైతులకు న్యాయంచేయాలని డిమాండ్ చేశారు. సాదా బైనామాలు ఉన్న వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలన్నారు.