సింగరేణి మండల కేంద్రంలో పీహెచ్‌సీలో శనివారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జెండా ఊపి 108 వాహనాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పీహెచ్‌సీ ఆసుపత్రిని త్వరలో 50 పడకల ఆసుపత్రిగా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తలారి చంద్ర ప్రకాష్, మంజుల, తిరుపతిరావు, టోనీ, యాకుబ్, శంషుద్దీన్, హనీఫ్, నాగేశ్వరరావు, వీరభద్రం, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.