ఇల్లందులో కొత్త రేషన్ కార్డుల సర్వే ప్రారంభం
ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని సత్య నారాయణపురం ఒకటో వార్డులో కౌన్సిలర్ వార రవి గురువారం కొత్త రేషన్ కార్డుల సర్వే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రేషన్ కార్డులకు అర్హులైన వారిని గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ రాజేందర్, వెంకన్న, సైదామియా, నాగమణి పాల్గొన్నారు.