ఇటీవలే నూతనంగా వాంకిడి మండలానికి వచ్చిన ఎస్సై ప్రశాంత్ ను బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లహు కుమార్ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఎస్సై ప్రశాంత్ ఈ సందర్బంగా మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులకు ఏ సమస్య వచ్చిన అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తు సాధించాలన్నారు.