అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. మంగళవారం అశ్వారావుపేట మండలం పెరాయిగూడెంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి కూడా చేస్తుందని పేర్కొన్నారు.