అమరవీరుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే

81చూసినవారు
అమరవీరుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే
అమరవీరుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం భద్రాచలం మార్కెట్ ఆఫీసులో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు బ్రిటిష్ వారితో పోరాడి తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్