చర్ల సరిహద్దు చత్తీస్ ఘట్ రాష్ట్రం జేగురుకొండ అడవుల్లో ఆదివారం జరిగిన ఎదురుకాల్పులలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జేగురుకొండ అడవుల్లోని సింగవరం, తుమర్ ప్రాంతాల్లో మావోలు ఉన్నట్లు సమాచారం అందడంతో డీఆర్డీ బలగాలు కూబింగ్ చేపట్టాయి. ఈక్రమంలో జరిగిన కాల్పులలో మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో ఒక తుపాకీ, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.