వ్యవసాయ కార్మికులకు కూలి భరోసా పథకం ఏర్పాటు చేయాలని బి. కే. ఎం. యు రాష్ట్ర అధ్యక్షులు కలకోట కాంతయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం పాల్వంచ చండ్ర రాజేశ్వరరావు భవన్ లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం వీసంశెట్టి పూర్ణచందర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికులకు కూలి భరోసా కింద ప్రతినెల 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.