భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ని గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిసినారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో మాట్లాడుతూ, గతంలో కేటాయించిన కుట్టు మిషన్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని కోరడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగిందని, మన జిల్లాలో ఆలస్యం అయిందని తెలియజేశారు.