మణుగూరు పురపాలకంలో పరిశుభ్రతపై సంబంధిత అధికారులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులోని ఆదర్శ నగర్, మామిడితోట ప్రాంతాల్లో శుక్రవారం పాయం పర్యటించారు. స్థానికులతో మాట్లాడి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ ఉమా మహేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏఈ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పీర్నాకి నవీన్, తదితరులు పాల్గొన్నారు.