క్రీడా పోటీలతో స్నేహభావం పెంపొందుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బూర్గంపాడులో కొనసాగుతున్న 17వ యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటు ఆదివారం ముగిసింది. ఫరీద్ ఎలె వన్ కొత్తగూడెం జట్టు ఫైనల్లో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలతోపాటు నగదు బహుమతులు ఆదివారం అందించారు