ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్త లింగాలలో కొలువైన శ్రీ కోట మైసమ్మ తల్లి హుండీ ఆదాయం రూ. 32901 వచ్చినట్లు ఆలయ పరిశీలకులు అనిల్ కుమార్, ఈవో నల్లమోతు శేషయ్య తెలిపారు. బుధవారం ఆలయ హుండీ తలుపులను తెరిచి అందులో ఉన్న నగదును లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ జూనియర్ అసిస్టెంట్ వరప్రసాద్, ఆలయ అర్చకులు పుల్లయ్య శర్మ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.