హిమాచల్‌ ప్రదేశ్‌లో కుంభవృష్టి

53చూసినవారు
హిమాచల్‌ ప్రదేశ్‌లో కుంభవృష్టి
దేశమంతటా వానలు దంచికొడుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో మేఘవిస్ఫోటనం జరిగి షిమ్లా, మండి, కులు జిల్లాలో గత 24 గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నదులన్నీ పొంగిపొరులుతూ దిగువ రాష్ట్రాల వైపు ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఇద్దరు మృతి చెందగా, 50 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని సీఎం సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్