పూర్తిగా మెరుగుపర్చిన భద్రత, సౌకర్యాలతో తయారు చేసిన వందే భారత్ స్లీపర్ కోచ్‌లను చెన్నైలోని ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బుధవారం ఆవిష్కరించింది. ఐసీఎఫ్‌లో 2018 నుంచి తయారవుతున్న 77 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. రాత్రి వేళల్లో కూడా దూరప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు వీలుగా పూర్తి ఏసీ కోచ్‌లతో వందేభారత్ స్లీపర్ కోచ్‌లను ఐసీఎఫ్ తయారు చేస్తున్నది.