కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు లోకాయుక్త బుధవారం నోటీసులు జారీ చేసింది. 2013-2018 మధ్య కాలంలో రూ.74.93 కోట్ల అక్రమాస్తులు సంపాదించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో సీబీఐ విచారణను ముగించి, లోకాయుక్తకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆస్తి, ఆదాయ వివరాలను తమకు అందించాలని లోకాయుక్త ఆయనకు నోటీసులు పంపింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు ఇది ఇబ్బందిగా మారనుంది.