శ్రీరాముడు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. నీతికి, నిజాయితీకి, నిబద్దతకు తండ్రి మాటకు కట్టుబడిన వ్యక్తిత్వతానికి నిదర్శనం శ్రీరామ చంద్రమూర్తి అని కొనియాడారు. ఆయన పాటించిన సిద్దాంతాలను, లక్షణాలను ప్రతి ఒక్కరు అలవర్చుకుని ధర్మబద్దంగా జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి(D) అందోల్ నియోజకవర్గం జోగిపేట పట్టణంలో నిర్వహించిన కల్యాణోత్సవ వేడుకలకు మంత్రి హజరై మాట్లాడారు.