
కూతురి బర్త్ డే.. క్యూట్ ఫొటో షేర్ చేసిన మహేష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేనికి ఆదివారం బర్త్డే కావడంతో మహేష్ బాబు కూతురితో దిగిన క్యూట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “అప్పుడే టీనేజర్ అయిపోయింది… హ్యాపీ బర్త్డే సితార… నీవు నా జీవితంలో ఎప్పుడూ వెలుగునే నింపుతావు. లవ్ యు సో మచ్” అంటూ విషెష్ చెప్తూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వగా.. ప్రియాంక చోప్రా సహా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సితారకు విష్ చేస్తున్నారు.