దేవరకద్ర: ఏడాదిలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి

70చూసినవారు
దేవరకద్ర: ఏడాదిలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ. 35 కోట్లతో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామన్నారు. సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి, హాస్పిటల్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్