జడ్చర్ల: పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఘనత బీజేపీదే

78చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని జడ్చర్ల నియోజకవర్గం సీనియర్ బీజేపీ నాయకుడు ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ అన్నారు. బుధవారం జడ్చర్ల మండలం గొల్లపల్లిలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ ఒక్కో మనిషికి ఐదు కిలోల సన్న బియ్యం కేంద్రం ఇస్తే, ఒక కిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్