జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం చౌటపల్లి గ్రామనికి చెందిన రామాంజనేయులు రైతు 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశారు. ఒక్కసారిగా బోరు పనిచేయకపోవడంతో వరి ఎండిపోయింది. గురువారం సాయంత్రం రెండు బోర్లు 500 ఫీట్ల చొప్పున వేశామని, నీళ్లు రాలేవని, బోర్లు వేసేందుకు రూ. 10 లక్షల వరకు ఖర్చు అయిందన్నారు. అప్పు తెచ్చానని శుక్రవారం రైతు కన్నీరు పెట్టుకున్నారు. 'అయ్యా సీఎం గారూ.. నన్ను ఆదుకోండి' అంటూ వేడుకున్నారు.