వెల్దండ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అమర జవాన్లకు కొవ్వొత్తుల ర్యాలీ తో ఘన నివాళులర్పించారు. దేశ రక్షణకు ప్రాణాలకు తెగించి తీవ్రవాదులతో పోరాడు తున్న వీర జవాన్లకు వందనాలు అని, వారి త్యాగాలు వెలకట్టలేని వని ఎస్సై నర్సింహులు, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ భూపతిరెడ్డి,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వావిళ్ళ సంజీవ్ కుమార్ యాదవ్ లు అన్నారు.
మంగళవారం జరిగిన భారత్-చైనా సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు తో పాటు వీరమరణం పొందిన జవాన్లకు మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై పై అంబేద్కర్ విగ్రహం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సేవలో ఎండనక వాననక చలి అనక ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ తన కుటుంబ సభ్యులను వదిలిపెట్టి రాత్రింబవళ్ళు కష్టపడుతున్న అమర జవాన్ల వలననే మనమందరం దేశంలో హాయిగా బతుకుతున్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఆర్యవైశ్య సంఘం జిల్లా కోశాధికారి బచ్చు రామకృష్ణ,, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఉప్పు అంజనేయులు రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి సింహారెడ్డి మండల కో ఆప్షన్ నెంబర్ హలీం మార్కెట్ డైరెక్టర్ రవి నాయక్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిర్యాల రాజయ్య బొమ్మిశెట్టి శ్రీనివాసులు కోశాధికారి రాచురు మల్లేష్ కార్యవర్గ సభ్యులు వెల్దండ రామకృష్ణ చారి కొట్ర మల్లేష్ బి కుమాoడ్లశ్రీనివాసులు నాయకులు శిశుపాల్ రెడ్డి పుష్పగిరి ఇ దామోదర్ ప్రజలు కిషన్ ధనుంజయ శ్రీను తదితరులు పాల్గొన్నారు.