మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో న్యాయవాదులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.