తెలంగాణ మలి దశ ఉద్యమంలో పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ త్యాగం మరువలేనిదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని ముదిరాజ్ భవన్ లో నిర్వహించిన పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్థంతిలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి ఆవేదన చెంది తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.